contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ షణ్మోహన్

పిఠాపురం : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యుడు కొణిదల పవన్ కళ్యాణ్ ఈనెల 25న పిఠాపురం నియోజకవర్గం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఇతర అధికారులతో కలిసి పిఠాపురం ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. గవర్నమెంట్ హై స్కూల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి మాట్లాడుతూ ఈనెల 25న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గం పర్యటన సందర్భంగా పిఠాపురంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం, రచ్చబండ కార్యక్రమం, మహిళ లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ వంటి కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉప ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. హెలిప్యాడ్ ను పిఠాపురం ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. క్రీడా మైదానంలో ఏర్పాటు చేయడం జరిగిందని, హెలిపాడ్ వద్ద ఏర్పాట్లను హౌసింగ్ పీడీ అధికారి పర్యవేక్షించాలని ఆదేశించారు. అదేవిధంగా ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. గవర్నమెంట్ హై స్కూల్ లో నిర్వహించే రచ్చబండ కార్యక్రమం సక్రమంగా జరిగేందుకు అధికారులు కృషి చేయాలని ఈ కార్యక్రమాన్ని అవసరమైన ఏర్పాట్లను జిల్లా రెవిన్యూ అధికారి, డ్వామా పీడీ, కాకినాడ ఆర్డీవో పర్యవేక్షించాలన్నారు. యు.కొత్తపల్లి గ్రామంలో నిర్మించనున్న నూతన టీటీడీ కళ్యాణ మండపం, గొల్లప్రోలు, చేబ్రోలు గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాల ఆవిష్కరణ ఉంటుందన్నారు. ఈ ఏర్పాట్లను జేడ్పీ సీఈవో చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం రధాలపేట అంబేద్కర్ సామాజిక భవనంలో బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళల విద్యార్థులకు కుట్టు మిషన్లు, వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు యంత్ర పరికరాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ ఏర్పాటులను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, బీసీ కార్పొరేషన్ ఈడీ చూడాలన్నారు. అనంతరం పిఠాపురం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఏరియా ఆస్పత్రికి శంకుస్థాపన చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, డీసీఎస్హెచ్ఎస్, ఏపీఎంఎస్ఐడిసి అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. మీడియా ప్రతినిధులు, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాట్లను సమాచార పౌర సంబంధాల అధికారులు చూడాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్నందున తగినంత తాగునీరు, బటర్ మిల్క్, ఇతర స్నాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ దగ్గర, గ్రీవెన్స్ స్వీకరణ దగ్గర ఆయా గ్రామాల సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంచాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో ప్రతిష్టంగా బారికేడ్లను ఏర్పాటు చేయాలని రోడ్డు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్ వద్ద విద్యుత్ స్తంభాలు పనులను విద్యుత్ శాఖ చూడాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. పోలీసు శాఖ ద్వారా బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను జిల్లా కలెక్టర్.. ఎస్పీ, జేసీ, సంబంధిత శాఖల అధికారులతో పరిశీలించి ఏర్పాటుకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ మానిష్ పాటిల్ దేవరాజ్, అదనపు ఎస్పీ ఎంజేవీ భాస్కర రావు, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, పాడా పీడీ ఏ.చైత్రవర్షణి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :