పిఠాపురం : గత రెండు రోజుల క్రితం పిఠాపురంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో, ఎస్.డి.పి.ఓ. రఘువీర్ విష్ణు పర్యవేక్షణలో పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ మూడు బృందాలను ఏర్పాటు చేసి ముద్దాయిల కోసం ముమ్మరంగా గాలించామన్నారు. బుధవారం ఉదయం పట్టణంలోని అయితే నగర్ కు చెందిన దుర్గాడ లక్ష్మయ్య అలియాస్ జాన్, అతడికి సహకరించిన ఇందిరా నగర్ కు చెందిన కొంగుపూడి సుబ్బలక్ష్మిలను గోర్స రోడ్డులోని రైస్ మిల్ సమీపంలో అరెస్టు చేసి, వారి వద్ద నుండి ఆటోను సీజ్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పెట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్ఐ వడ్డాది మాణికుమార్, స్టేషన్ సిబ్బంది వున్నారు.