contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎటుపోతోంది సమాజం..? .. మహిళలపై అత్యాచారాలు .. అండగా ఉంటాం అన్న పవన్ ఎక్కడ..?

  • రోజు రోజుకి పెరిగిపోతున్న మహిళలపై అత్యాచారాలు
  • బంగారు బాల్యాన్ని చిదిమేస్తున్న దుండగులు
  • ఇంటా, బయట పెరిగిన అఘాయిత్యాలు
  • కఠిన చట్టాలు తెచ్చినా… కానరాని మార్పు
  • దురాగతాలకు అంతం ఎప్పుడో…?
  • మహిళలకు అండగా ఉంటాం అన్న పవన్ ఎక్కడ…?

 

పిఠాపురం : ఎటుపోతోంది సమాజం..? ఉచ్చ, నీచాలు, వావివరుసలు లేని పాతరాతి యుగంలా రగులుతోందా..? ఆదిశక్తిని కొలిచే ఈ సమాజమే ఆడబిడ్డను ఆటబొమ్మగా చూస్తోందా..? బేటీ అంటే ఇంటికి బ్యూటీ అంటారు కదా..! మరి ఆ అందాన్ని ఆరాధిస్తున్నారా లేక అంతులేని కామ వాంఛతో చిదిమేస్తున్నారా…? భగవంతుడిచ్చిన అవయవముంటే చాలు పడుచు పిల్ల, పండు ముసలి అన్న తేడా లేదు. పాలుగారే పసిపాప అయినా పర్వాలేదు. అంతులేని ‘కోరికతో అకృత్యాలకు తెగబడుతున్నారు. మగ పుట్టుక పుడితే చాలు… ఆడేపాడే వయసు నుంచి కాటికి కాలు చాచే వయసులో ఉన్న వారిని కూడా కోరికలతో కాటేస్తున్నారు. ఎక్కడుంది లోపం? ఇంటిలోనా? సమాజంలోనా లేక పాఠాలు చెప్పే బడిలోనా? ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు అంతం ఎప్పుడో?
ఇటీవల కాలంలో పసిపాపలపై లైంగికదాడులు పెరిగాయి. బడిలో, ఆట స్థలాల్లో, అంగడికెళ్లే చోట ఇలా ఏదో ఒక చోట అమ్మాయిలపై లైంగిక దాడులు నిత్యకృత్యంగా మారాయి. ఒక చోట అన్న, మరో చోట నాన్న, ఇంకో చోట…చిన్నాన్న, మరో చోటు హితుడు, ఇంకో దగ్గర స్నేహితుడు…. ఇలా ప్రతి చోట పాత్ర మారుతోందే కానీ…. మనిషి మాత్రం ‘అతడే’. అతడి నుంచి వేధింపులు మాత్రం ఆగడం లేదు. తియ్యని మాటలు వినిపిస్తాయి. కమ్మని ప్రేమ కనిపిస్తుంది. కానీ సమయం వచ్చినడప్పుడు చీకటిలో దాడులు చేసి బాలికల వెలుగును చిదిమేస్తున్నారు. ఒక ప్రాంతంలో 12 ఏళ్ల బాలుడు, ఇంకో ప్రాంతంలో పాతికేళ్ల యువకుడు, ఇంకో చోట నలబై ఏళ్ల నడి వయస్కుడు, మరోచోట 60 ఏళ్లు దాటిన వృద్ధుడు… ఇలా అన్నిటా వయస్సు మారుతోంది కానీ… వేధింపులు ఆగడం లేదు.

– బంగారు బాల్యంపై విషం

పాలుగారే పసి ప్రాయాన్ని కొన్ని చీడ పురుగులు చిదిమేస్తున్నాయి. బంగారు బాల్యాన్ని చేదు జ్ఞాపకంగా మిగులుస్తున్నారు. చాలా చోట్ల పిల్లలపై లైంగికంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. పిల్లలు దేనికైనా త్వరగా ఆకర్షితులు అవుతారు. అది చెడు చేస్తుందా…? మంచి చేస్తుందా..? అని ఆలోచించే జ్ఞానం వారికి తక్కువగా ఉంటుంది. ఇదే మ”మృ”గాళ్లకు అవకాశంగా మారుతోంది. చాలామంది తినుబండారాలు ఇవ్వడం, ఆట వస్తువులు ఇవ్వడం, లేదా కొనిస్తాని బయటకు తీసుకెళ్లడం వంటివి చేస్తూ… లైంగిక దాడులకు దిగుతున్నారు. ఈ విషయంలో మనవాళ్లా… పక్క వాళ్ల పిల్లలా అన్న విచక్షణ కూడా మరచి… రాక్షస మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు పిల్లల జీవితంపై తీరని గాయాన్ని చేస్తున్నాయి.

– నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ తేలేరా..!?

జిల్లాలో ఐసీడీఎస్‌, డీసీపీఓ, చైల్డ్‌ లైన వంటి విభాగాలున్నా ఈ నేరాలను అరికట్టడంలో ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. బాల్యంలో పసి మనసులు గాయపడితే… దానిని మాన్పడం ఎవరి తరం కాదు. అందుకే నేరాలు జరగకుండా చూడాల్సిన బాధత్య ఉంది. జిల్లాలో కలెక్టర్‌, ఎస్పీ వంటి ఉన్నతాధికారులతోపాటు చట్టాలు చేసే శాసనసభ్యులు, పార్లమెంట్‌ సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర మేధావులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఇలా ఎందరో ఉన్నారు. వీరంతా సమష్టిగా లైంగిక నేరాల నియంత్రణకు నిరంతరం పర్యవేక్షణ చేసే ఒక వ్యవస్థను తేవాల్సిన బాధ్యత ఉంది. ఆ దిశగా జిల్లా యంత్రాంగం, పాలకులు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. భావితరాల బాల్యానికి భద్రత కల్పించాల్సిన అవసరం, బాధ్యత కూడా ఉంది.

– మానవ సమాజంలో దేనికోసం ఆరాటం…?

మనం పుట్టినప్పుడు తల్లి నవ మాసాలు మోసి కంటుది ఆ మహాతల్లి మగవాడా ఆడదా అని చూడదు. ఎంతో సంతోషంగా ఆ ఇంట్లో సంబరాలు చేసుకుంటారు. పిల్లలు పెద్ద వాళ్ళు అవుతారు మగ బిడ్డ పుడితే ఇంటికి వారసుడు పుట్టాడు అని సంబరపడతారు. అదే ఆడపిల్ల పుడితే ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని గొప్పగా చెప్పుకుంటారు. ఈనాడు సమాజంలో మహిళలు గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నప్పటికీ సమాజంలో మహిళలను చూడగానే పురుషులకు చులకన భావం ఎందుకు…? ఈ మధ్య కాలంలో మహిళపై ఘోరమైన అత్యాచారం పెరిగిపోయాయి. మహిళ మన కుటుంబంలో అక్కగా, చెల్లిగా, అమ్మగా, భార్యగా, అత్తగా అనేక రకాలుగా పిలుచుకుంటాం. అటువంటి స్త్రీపై ఈ మధ్య కాలంలో అత్యాచారాలకు గురవుతున్నారు. చట్టాలు ఉన్నప్పటికీ వాటిని అతిక్రమించి నేరాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా మారండి. ఆడపిల్లల్ని బ్రతకనిద్దాం.. బ్రతికిద్దాం.

– బాధిత కుటుంబానికి అండగా ఉంటాం – మాజీ ఎమ్మెల్యే వర్మ

తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ సంఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దోషులను కఠినంగా శిక్షించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

– మహిళలకు అండగా ఉంటాం అన్న పవన్ ఎక్కడ…?

మహిళలకు అండగా ఉంటాం అన్న పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర డిప్యూటీ సిఎం కొణిదల పవన్ ఎక్కడ అన్న ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది. మొన్న తన సొంత నియోజకవర్గంలో ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన బాధ్యత వున్నా తన నియోజకవర్గ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ ను బాధిత కుటుంబాన్ని పరామర్శించాడనికి పంపించారు తప్ప.. ఆయన కనీసం ఫోన్లో మాట్లాడిన దాఖలాల్లేవు. పోలీసు ఉన్నతాధికారులకి మాత్రం ఫోన్ చేసి ముద్దాయిలపై కేసు నమోదు చేసి తక్షణమే పట్టుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వకిల్ సాబ్ సినిమాలో ఆడ పిల్లల గురించి డైలాగులు చెప్పడం కాదు… రాజకీయంగా ఒక గౌరవ ప్రదమైన పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అత్యాచారం జరిగిన బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :