కాకినాడ : ప్రజల్లో పది రూపాయలు (10/-) నాణెం చెల్లుబాటు పై ఉన్న అపోహలు తొలగించడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ) ఆదేశాల మేరకు యూనియన్ బ్యాంక్ నేతృత్వంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి సమక్షంలో పది రూపాయలు నాణెం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పది రూపాయలు నాణెం సంబంధించి ఏ విధమైన అపోహలు నమ్మవద్దని, పలు రకాలతో ముద్రితమైన అన్ని పది రూపాయలు నాణెం విధిగా చెల్లుతాయని కలెక్టర్ తెలియజేశారు. రూ.10 నాణెం తిరస్కరించడం శిక్షార్హులని యూనియన్ బ్యాంక్ ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ కలెక్టరేట్ బ్రాంచ్ మేనేజర్ అత్తిలి వెంకట సురేష్ కుమార్, యూనియన్ కరెన్సీ చెస్ట్ మేనేజర్ రామకృష్ణ పాల్గొన్నారు.