- జనసేన జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు
పిఠాపురం : కాకినాడ జిల్లా జగ్గంపేట శాసనసభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు జ్యోతుల నెహ్రూ జన్మదినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం ఉదయం జగ్గంపేటలో ఏర్పాటు చేసిన జ్యోతుల నెహ్రూ జన్మదినోత్సవ వేడుకల కార్యక్రమానికి పిఠాపురం నియోజవర్గం జనసేననాయకుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు హజరైయ్యారు. ముందుగా జ్యోతుల నెహ్రూకి జన్మదినోత్సవం శుభాకాంక్షలు జ్యోతుల శ్రీనివాసు తెలియజేస్తూ ఆయనకు డైరీ పెన్నుతో పాటు 200 నోట్ పుస్తకములు జ్యోతుల నెహ్రూకు అందజేశారు. అనంతరం జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీనియర్ రాజకీయ నాయకుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకే దక్కుతుందన్నారు. జ్యోతుల నెహ్రూ మెట్ట ప్రాంతలో గత 40 సంవత్సరాలుగా రాజకీయ రంగంలో ఉన్న సీనియర్ నాయకుడని, ప్రాంత అభివృద్ధి ప్రధాతని, ఆయన చాగల్ నాడు ఎత్తిపోతలు, పురుషోత్తపట్నం ఎత్తిపోతలు వంటి సాగునీరు ప్రాజెక్టులు రూపశిల్పి జ్యోతుల నెహ్రూ అని అన్నారు. జ్యోతుల నెహ్రూ సహజమైన స్వరతత్వం గల నాయకులని జన్మ దినోత్సవనికి వచ్చేవారు ఆయనకు బొకేలు గానీ, దండలు గానీ తేవద్దని వాటికి బదులుగా పూల మొక్కలు, పుస్తకాలు తెస్తే పేద విద్యార్దులకు ఇవ్వవచ్చునని, తద్వారా వారికి వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పిన నాయకులు జ్యోతుల నెహ్రూ అని జ్యోతుల శ్రీనివాసు తెలియజేశారు. జ్యోతుల శ్రీనివాస్ వెంట దుర్గాడ మాజీ ఎంపీటీసీ సభ్యులు కొమ్మూరి కృష్ణ, దుర్గాడ గ్రామ జిల్లా పరిషత్ హైస్కూల్ మాజీ చైర్మన్ కందా శ్రీనివాస్, జ్యోతుల సీతారాంబాబు, కోలా నాని, జ్యోతుల పెద్దశివ సఖినాల శివ, జ్యోతుల చిన్నశివ, ప్రత్తిపాడు జనసేన నాయకుడు మేకల కృష్ణ, కత్తిపూడి జ్యోతుల వీరబాబు తదితరులు ఉన్నారు.