పిఠాపురం : ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా టెలికాం అడ్వైజరీ మెంబర్‌గా జనసేన పార్టీ నాయకుడు మేకల కృష్ణను నియమించారు. 2024 పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలో కాకినాడ పార్లమెంటుస్థాయిలో తుని, ప్రత్తిపాడు, పిఠాపురం అసెంబ్లీ నియోజవర్గాలకు సంబంధించిన కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గెలుపు కొరకు కృషిచేసినందుకు, అదేవిధంగా కూటమి తెలుగుదేశం అభ్యర్థులైన తుని, ప్రత్తిపాడు నియోజవర్గం యనమల దివ్య, వరుపుల సత్యప్రభరాజా గెలుపు కొరకు తగు కృషి చేయడం వలన జనసేనపార్టీ తరపున కాకినాడ పార్లమెంటు నియోజవర్గస్థాయిలో తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ తన సేవలను గుర్తించి, జనసేనపార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గం ఇంచార్జ్ వరుపుల తమ్మయ్యబాబు సిఫార్సు మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టెలికాం అడ్వైజరీ మెంబర్‌గా నియమించడం జరిగిందన్నారు. తనను ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా టెలికాం అడ్వైజరీ మెంబర్‌గా నియమించినందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు, పిఠాపురం శాసన సభ్యుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, కాకినాడ పార్లమెంటరీ సభ్యుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, ప్రత్తిపాడు నియోజవర్గం ఇన్చార్జి వరుపుల తమ్మయ్యబాబు, జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. పార్టీలో కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరికీ పార్టీ అధ్యక్షుడు కీలకమైన బాధ్యతలు అప్పగిస్తునారని, ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించాలన్నారు.
