రిపోర్టర్ టివి ప్రత్యేక కథనం : టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా బిఎస్ఎన్ఎల్ సంస్థకు నియామకం చేసే నామినేటెడ్ చేసే పదవులు ఎందుకూ కొరగానివని పలువురు ప్రముఖులు పేర్కొంటున్నారు. ఆరు నెలలకు ఒకసారి కేంద్ర బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జరిగే సమావేశానికి మాత్రమే టిఎసి సభ్యులను ఆహ్వానిస్తారు. ఉద్యోగులతో బాటుగా అందరూ ఇతర ప్రయివేటు టెలిఫోన్ కంపెనీల సిమ్ లు వాడుతుంటారు. బిఎస్ఎన్ఎల్ గురించి మీటింగ్ పెడతారు. వచ్చిన సభ్యులకు ఒక టీ, స్వీట్, హాట్ అల్పాహారం ఇస్తారు. చేయి తుడుచుకోవడానికి వేస్ట్ పేపర్ కూడా ఇస్తారు. సభ్యుడు ఆ జిల్లాలో ఏ ప్రాంతం నుండి వస్తున్నారో రికార్డు అడ్రస్ ప్రకారం కిలో మీటర్ లెక్కన రోడ్డు రవాణా చార్జీలు లెక్కకట్టి అణా పైసలతో సహా కవర్ లో పెట్టి సంతకం చేయించుకుని ఇచ్చేస్తారు. ప్రజలు ఎవరూ బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడరు. వాడినా అవి అన్ని చోట్ల పనిచేయవు. రేటు రిబేటు వున్నాయని వాడినవారు తిట్టిన తిట్టు కోకుండా వుండరు. కారణం అత్యవసరాల్లో కాల్స్ రాక పోకలు, వాట్సప్, ఫేస్బుక్ పనిచేయనప్పుడు ఇబ్బంది పడటం సహజం.. కానీ నిరంతరం జరిగే ప్రక్రియలో బిఎస్ఎన్ఎల్ అంటే చిరాకు పడతారు. ల్యాండ్ ఫోన్ కనెక్షన్లు ప్రభుత్వ కార్యాలయాల్లో మినహా మరెక్కడా లేవు. సెల్ టవర్లు ప్రయివేటు సెల్ సంస్థలకు తప్ప ప్రభుత్వ సంస్థలకు అనువు కాకుండా వుంటాయి. ప్రయివేటు వ్యాపారం పెంచడానికి తప్ప ప్రభుత్వ రంగ సంస్థ ప్రగతికి పని చేసే పరిస్థితి వుండదు. ఇటువంటి ప్రక్రియలో గత రెండు దశాబ్దాలుగా టిఎసి మెంబర్ అంటే అదో పనికిమాలిన భర్తీగా గతంలో పని చేసిన మెంబర్లు చెబుతుంటారు. మూడు దశాబ్దాల కిందట టెలిఫోన్ సలహా సంఘం సభ్యుడు అంటే అద్భుతంగా వుండేది. ల్యాండ్ ఫోన్ సౌకర్యం నచ్చిన మెంబర్ కేటాయింపు సమస్యల పరిష్కారం విషయంలో వినియోగదారులకు సేవ చేయగలిగే అవకాశం వుండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. కేవలం పత్రికల్లో అదేదో గొప్ప నియామకం అన్నట్టుగా నామినేటెడ్ పోస్ట్ దక్కించుకున్నాం అన్నట్టుగా పేరు గొప్ప ఊరు దిబ్బ చందాన ఫ్లెక్స్ యాడ్ కోసం తప్ప ప్రజలకు గాని సమాజానికి గాని ఉపయోగపడే అవకాశమే లేదు. పార్లమెంట్ మెంబర్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నియామకం చేసే టెలిఫోన్ సలహా సంఘ సభ్యులను బిఎస్ఎన్ఎల్ ఆహ్వానిస్తుంది. అంతకు మించి ఎటువంటి షో వుండదు. ఇంతమాత్రం దానికి ఎందుకు అనుకునేలోగానే రెండేళ్ల టిఎసి మెంబర్ కాలం ముగిసిపోతుంది. ఎందుకూ కొరగాని టిఎసి నియామకాలు ద్వారా ప్రహసనం చేయడం హాస్యాస్పదమని, ఇది తెలియని వారు అదేదో గొప్ప పదవిగా భావిస్తున్న వారి పట్ల అజాత శత్రువులు సైతం వారి అమాయకత్వం చూసి జాలి పడుతుంటారు.