- పౌర సంక్షేమ సంఘం
కాకినాడ : టుటౌన్ ఓవర్ బ్రిడ్జి దిగువ నుండి టౌన్ రైల్వేస్టేషన్ జవహర్ వీధి మీదుగా మెయిన్ రోడ్డును అనుకునివున్న సూర్యారావుపేట, సాలిపేట ప్రాంతాలలో గంజాంవారి వీధి శివారు వరకు వున్న వీధి విద్యుత్ దీపాల్లో 57 స్థంభాల లైట్లు వెలగడం లేదని సామాజికవేత్త, పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. డివిజన్ సరిహద్దు రోడ్లల్లో రెండు వైపులా మెయిన్ రోడ్ లో 38/358, 39/35b,158/33b,162/33b,163/33b, జవహర్ వీధిలో 40/40b, 6-1-49 వద్ద, రైల్వే స్టేషన్ రహదారి 154/36a, 31/40b దంటు వారి వీధిలో 41/35b, 12-2-29/1, 33/11 వద్ద బ్రిడ్జి పైన 121/35a, 120/35a, 111/35a, 109/35a వద్ద మునసబు వీధిలో 46/35a, 6-4-11 వద్ద హెడ్ పోస్ట్ ఆఫీస్ లైన్ లో 78/34a, 79/34a, 80/34a, 81/34a, 38/35b, 134/33b, 41/35b, 156/33b, 153/33b, 81/35, 153/33b, 154/33b, 149/33b, 144/35b, 161/33b, పిఆర్ జూనియర్ కాలేజీ 147/35b, జడ్జిక్వార్టర్స్ 156/35b, 136/b3, దలాయిత్ స్టార్ వీధి22-1-11, 120/35b, పైడావారి వీధి 93/35, 112/35b రామయ్య వీధి 51/135b, దూసర్లపూడి వారి వీధిలో 85/35a టుటౌన్ పోలీస్ స్టేషన్ 101/33a టిటిడి సెంటర్ హైమాస్ట్ లైటింగ్ లో రెండు దీపాలు వెలగడం లేదన్నారు. పలు వీధుల్లో స్తంభాలకు విద్యుత్ దీపాల అమరిక కరువయ్యి చీకటి తాండవిస్తున్నదన్నారు. బ్రిడ్జి మీద దీపాలు వెలగక పోవడం వలన బ్రిడ్జి దిగువ రెండు వైపులా వున్న మార్గాల్లో చీకటి దాపురిస్తున్నదన్నారు. వీధి దీపాలు పూర్తి స్థాయిలో వెలిగించే బాధ్యత లేకుండా ప్రజలు పిర్యాదు చేస్తే రిపేరు చేస్తాం లేకుంటే లేదన్న తీరు తగదన్నా రు. 35వ డివిజన్ నుండి ఏటా రూ.3.5 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలు చేస్తున్న కార్పోరేషన్ పౌర సౌక ర్యాల కల్పనలో తగిన శ్రద్ధ చేయడం లేదన్నా రు. రోడ్లు ఎత్తు చేసిన చోట డ్రెయిన్స్ నిర్మాణం చేయలేదన్నారు. అన్ని వీధుల్లోనూ కల్వర్టులు శిథిల స్థితికి చేరి దిగqబడి పోయి ఉన్నాయన్నారు. టుటౌన్ ఓవర్ బ్రిడ్జి వద్ద ఆర్ అండ్ బి క్రాస్ కల్వర్టు పునః నిర్మాణం చేయకపోవడం వలన 1967లో నిర్మించిన ఇరుకు కల్వర్టు నుండి మురుగునీరు వర్షం నీరు ప్రవహించక నూకాలమ్మ గుడి రోడ్డులో ఎస్.బి.ఐ కేంద్ర కార్యాలయం వరకు ముంపు నీరు రోడ్డేక్కిపోతున్న దుస్తితి ఎక్కువయ్యిందన్నారు. అవసరం లేకుండా కొన్ని వీధుల్లో రోడ్లు ఎత్తు చేయడం వలన లోతట్టు వీధుల్లో వర్షాల తాకిడికి మురుగు రోడ్ల మీదకు చేరుతున్న అవస్థ ఎక్కువయ్యిందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సిబ్బంది తక్కువకావడం వలన బ్రిడ్జి దిగువన అపారి బెడద ఏర్పడిందన్నారు. రోజూ వారీగా డ్రైన్ల నిర్వహణ జరగడంలేదన్నారు. ట్రాఫిక్ రూల్స్ కి వ్యతిరేకంగా వీధుల్లోకి ట్రాన్స్ పోర్టు భారీ వాహనాలు రావడం వలన కల్వర్టులు కృంగిపోతున్నాయన్నారు. కేబుల్ వైర్లు విద్యుత్ స్తంభాలకు ఇష్ఠానుసారంగా చుట్టడం వలన తెగిపడిన సందర్భాల్లో వాహనదారులకు ప్రమాదకరంగా మారాయన్నారు. సచివాలయం సిబ్బంది పర్యవేక్షణలో ప్రజల పౌర సౌకర్యాల అవస్థల గురించి ప్రతి నెల నివేదిక చేపడితే మేలు జరుగుతుందన్నారు. కార్పొరేషన్ ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పాలక వర్గం లేనందున సచివాలయం పరిధిలో పౌర సమావేశాలు నిర్వహించి అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.