పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం శ్రీసూర్యరాయ విద్యానంద గ్రంధాలయ ఆవరణలో ఉన్న చెలికాని భావనరావు సభాసదన్ లో కాపు ఐక్య వేదిక సభ్యులు శనివారం సాయంత్రం సమావేశం అయ్యారు. కాపు వన సమారాధన భోజనాలు ఏర్పాటు పై చర్చించారు. ఈ సందర్భంగా కాపు ఐక్య వేదిక అధ్యక్షుడు బుర్రా అనుబాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చేసే విధంగానే ఈ సంవత్సరం కూడా కాపు వన భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల నవంబర్ 24వ తేదిన ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి సహకరిస్తున్న కాపు అక్కా, చెల్లెళ్లకు, అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అన్ని వసతులతో కూడిన వనమహాసమారాధన ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తిరిగి నవంబర్ 2వ తేదీ మరల సమావేశం ఏర్పాటు చేస్తామని, అలాగే రాజకీయాలకు అతీతంగా అందరూ రావాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు. కాపు వన మహా సమారాధన కార్యక్రమం కార్యచరణ వివరాలు త్వరలో వెల్లడిస్తావని అన్నారు. ఈ కార్యక్రమంలో జవ్వాది కృష్ణమాధవరావు, బొజ్జా మాణిక్యాలరావు (అయిలు), కొండేపూడి శంకరరావు, దేవరపల్లి చినబాబు, పట్టణ కాపు సోదరులు తదితరులు పాల్గొన్నారు.