- కాకినాడ సిటీ నియోజక వర్గంలో కూటమి ఎమ్మెల్యే మాట చెల్లడం లేదా…!!
కాకినాడ : ప్రస్తుతం కాకినాడ ప్రజల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే కాకినాడ నగర పాలక సంస్థలో టిడ్కో బాండ్ల వివాద స్థలంలో ఇధనాల్ ప్రాజెక్ట్ చేపట్టారు. అదీ ఎమ్మెల్యే లేకుండా.. రైతు బజార్ లో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే హవా, రూరల్ ఎమ్మెల్యే అనుచర వర్గం హవా, సివిల్ సప్లైస్ చైర్మన్ జోక్యంతో నడుస్తుంటే సిటీ ఎమ్మెల్యే మౌనంలో వున్నారు. తాజాగా దీపావళి దుకాణాల అనుమతులు రద్దు చేసారని, సిటీ టీడీపీ అధ్యక్షుడు ఆర్ డి ఓ కార్యాలయం వద్ద నడి రోడ్డుపై పడుకున్నారు. గతంలో రేఖారాణి అనే ఫైర్ బ్రాండ్ అధికారిణి అప్పట్లో ఇక్కడి ఎమ్మెల్యేని లెక్కచేసే వారు కాదు. అడగడానికి వెళ్ళిన ఎమ్మెల్యేకు ఫోన్ ఇచ్చి సిఎంతో మాట్లాడమని చెప్పే స్థాయికి వ్యవహరాలు వుండేవి. ప్రస్తుతం ఆనాటి విషయాలను రాజకీయ ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. కార్పొరేషన్ కార్యక్రమాల్లో కుర్చీ తెప్పించుకోవాలి తప్ప ఎమ్మెల్య కి కుర్చీ వేసే ఆహ్వానం లేకపోవడంతో కమీషనర్ కార్యక్రమాలకు ఎమ్మెల్యే దూరంగా వుంటున్నారు. ప్రజల్లో చులకన ఏర్పడింది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం సిటీ అధ్యక్షుడు రోడ్డు మీద పడుకోవడం. అధికార పార్టీ ఎమ్మెల్యే చేతకానితనాన్ని పబ్లిక్ చేసుకుంటున్నారని ఇంతోటి దానికి మాజీ ఎమ్మెల్యేని ఆడిపోసుకోవడం విడ్డూరంగా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. ఇటీవల దీపావళి దుకాణాలకు ఇష్టారాజ్యంగా షామియానాలు వెలిశాయి. వీటిపై అధికారపార్టీ ప్రతిపక్ష పార్టీ కొమ్ముకాసే ఆ రెండు పత్రికలు బాహాటంగా విమర్శిస్తూ వార్తలకెక్కాయి. అధికారులు రద్దు చేశారు. అధికారశ్రేణులు రోడ్డెక్కారు. ప్రజల బాగోగుల కోసం రోడ్డెక్కాల్సిన నాయక శ్రేణులు మత్తెక్కిన తీరుగా వారి వ్యవహారాలు ఉంటున్నాయన్న వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. ఎటొచ్చీ సిటీ ఎమ్మెల్యే పరపతి అపహస్యంగా వుందన్న విషయం అధిష్టానం గ్రహించడం లేదా…?!! లేదంటే భవిష్యత్ రాజకీయ వ్యూహంలో ఇదొక ఎత్తుగడా అనే సందేహాలూ ఉన్నాయి.