- జనాభా నిష్పత్తిగా రాజ్యాంగ ఫలాలు దక్కాలి : పౌర సంక్షేమ సంఘం
కాకినాడ : 93ఏళ్ల క్రిందట బ్రిటీష్ ప్రభుత్వం 1931లో లెక్కించిన కుల జన గణన ప్రక్రియను దేశ స్వాతంత్ర్యం తరువాత భారత ప్రభుత్వం నిర్వ హించకపోవడం వలన సమసమాజ నిర్ధేశిత రాజ్యాంగ ఫలాలు లభించడం లేదని పౌర సంక్షేమ సంఘం పేర్కొం ది. స్వాతంత్ర్యానికి పూర్వం ముస్లిం, సిక్కు, క్రైస్తవ, మైనారిటీ నిమ్న కులాలవారి జన గణన బట్టి చట్టసభల్లో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించారన్నారు. బిఆర్ అంబేద్కర్ కృషితో మొదటి రాజ్యాంగ సవరణ (15(4) ఆర్టిక ల్)తో రాష్ట్రాలలో కాన్షీ రామ్ కృషితో కేంద్రంలో రిజర్వేషన్లు వచ్చాయన్నారు. కేంద్రప్రభుత్వం చేపట్టే జాతీయ జన గణనలో కులగణనను చేపట్టి జనాభా నిష్పత్తిగా చట్టసభల్లో స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. విద్య, ఉద్యోగ, ప్రమోషన్లలో రిజర్వేషన్ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 2011నుండి జన గణన లేక బిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటీలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కోల్పోతున్న దుస్థితి వుందన్నారు. ఓటరు గణాంకాలతో రాజ్యాంగ ఫలాలు సముచితంగా దక్కడంలేదని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు.