కాకినాడ : కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ సమీపంలో ఎమ్మార్వో ఆఫీసు ఎదురుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వాహనదారుని వెనుక నుంచి లారి ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు సర్పవరం స్టేషన్ కి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ రామచంద్రరావు. దీని పై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.