కాకినాడ : కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో మెడికల్ వార్డు వద్ద లిఫ్టులో రోగులు ఇరుకున్నారు. మెడికల్ వార్డులో ఏర్పాటు చేసిన లిఫ్టు టెక్నీషియన్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్న రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 30 నిమిషాల పాటు లిఫ్టులోనే ఉన్న రోగులు ఎట్టకేలకు బయట పడ్డారు. ఇలాగే గతంలో చాలాసార్లు జరిగిందని స్థానికులు తెలిపారు. దీనిపై ఎన్నిసార్లు ఆసుపత్రి సూపరిడెంట్ కి పిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి శాశ్వత పరిష్కారం చేయాలని రోగులు వేడుకుంటున్నారు.