కాకినాడ జిల్లా: పిఠాపురం పట్టణం దత్త నగర్ 2వ వార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో చల్లా శివ కుటుంబానికి చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమామక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు చేసారు. కానీ అప్పటికే ఇల్లు పూర్తిగా దగ్దమైంది.
బాధితులైన చల్లా శివ కుటుంబం కట్టు బట్టలతో మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది. చల్లా శివకు భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి మరియు తమ్ముడు ఉన్నారు.
తార జువ్వ ఇంటిపై పాడడం వలన ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికుల సమాచారం.
ఈ ప్రమాదం నుంచి బయటపడిన చల్లా శివ కుటుంబానికి నష్ట పరిహారం అందించాల్సిందిగా స్థానిక ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.