- కరపత్రాన్ని విడుదల చేసిన జెఎసి నాయకులు
పిఠాపురం : గురువారం ఉదయం కాకినాడ కచేరిపేటలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎస్సీ రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి కాకినాడ జిల్లా మాల మహానాడు జెఎసి అధ్యక్షుడు సిద్దాంతుల కొండబాబు అధ్యక్షతన అఖిల భారత మాల సంఘాల జెఎసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను, క్రీమీలేయర్ పై ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు వెంటనే సమీక్షించి ఉపసంహరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 18వ తేదీన కాకినాడ అంబేద్కర్ భవన్లో నిర్వహించే సమావేశానికి మాలలు అందరూ వేలాదిగా తరలిరావాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న పివి రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, అఖిల భారత మాల సంఘాల జెఎసి వర్కింగ్ కమిటి చైర్మన్ పండు అశోక్ కుమార్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ధనరాజ్ శ్యాంలు కాకినాడలోని అంబేద్కర్ భవన్లో జరిగే కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 18వ తేదీన పెద్ద ఎత్తున జరగబోయే సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. అదే విధంగా కార్యక్రమానికి విచ్చేసిన జెఎసి నాయకులు అందరికీ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రతీ గ్రామంలోని ఎస్సీ వర్గీకరణ పై అవగాహన సదస్సులు నిర్వహించి, అందరూ కూడా తమ తమ బాధ్యతగా చొరవ తీసుకుని స్వచ్ఛందంగా తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి, పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్జి ఖండవల్లి లోవరాజు, జై భీమ్ రావ్ భారత్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ, మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి లింగం శివ ప్రసాద్, బీఎస్పీ తుని నియోజకవర్గం ఇన్చార్జి తంతడి కిరణ్, దళిత బహుజన ఫ్రంట్ నాయకుడు తోటి చంగళరావు, ఆడబాక గురునాథ్, పొలిపల్లి సూర్య భగవాన్ (బాబీ), బీఎస్పీ ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్చార్జి అపురూప్ తదితరులు పాల్గొన్నారు.