- రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన కలిపించిన సిఐ శ్రీనివాస్
పిఠాపురం : పిఠాపురం పట్టణంలో రోజు రోజుకీ ఇబ్బంది కరంగా మారిన ట్రాఫిక్ సమస్య పై ప్రత్యేక దృష్టి పెట్టిన పిఠాపురం పోలీసులు బుధవారం సాయంత్రం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో భాగంగా పిఠాపురం పట్టణం ఉప్పాడ సెంటర్ నుండి కోట గుమ్మం, మార్కెట్ మరియు చర్చి సెంటర్ వరకు గల రోడ్డులో పిఠాపురం సిఐ జి.శ్రీనివాస్, పట్టణ ఎస్సై వడ్డాది మణికుమార్ విజువల్ పోలీసింగ్ లో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ, రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి షాపుల యొక్క ఆక్రమణలను తొలగిస్తూ వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేయడం జరిగిందని సిఐ శ్రీనివాస్ తెలిపారు. అదేవిధంగా ప్రజలకు రోడ్డు భద్రతా మరియు జాగ్రత్తలు పై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలు పాటించని వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలను నడపవద్దని మద్యం ప్రియులకు హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతీ ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు.