పిఠాపురం : యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సుబ్బంపేట గ్రామానికి చెందిన బొందు ఇస్సాకు చెందిన బోటు బోల్తా పడింది. అమినాబాద్ మినీ అర్బర్ లో సంఘటన చోటుచేసుకుంది. వేటకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో తుఫాన్ కారణంగా అలలు ఉదృతి పెరగడంతో కెరటం తాకిడికి బోటు తీవ్రంగా ధ్వంసం అయింది. తీర ప్రాంతం కావడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని బాధితులు తెలిపారు. బోటు పూర్తిగా ధ్వంసం అయ్యినందున బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులకు నష్ట పరిహారం అందించాలని మత్యకార సంఘం నాయకులు కోరారు.