పిఠాపురం : నేటి బాలలే రేపటి పౌరులు అన్న నినాదాన్ని రుజువు చేశారు వి.వి.యస్. విద్యార్థులు. వారు రోజు స్కూలుకు వెళ్లి వచ్చే మార్గంలో ఇళ్ళు లేక రోడ్డుపై నిద్రిస్తున్న వారిని చూసి చలించిన పసి హృదయాలు వారికి ఏదో చేయాలనే ఆలోచనలో పడ్డారు. అదే ఆలోచన ఆచరణ చేయడానికి వారికి తోడుగా ఎబియర్ ఫౌండేషన్ నిలిచింది. బాలల దినోత్సవం సందర్భంగా వి.వి.యస్ విద్యార్థులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. శీతాకాలం కారణంగా షెల్టర్ లేక పిఠాపురం, కాకినాడ రోడ్ల పక్కన నిద్రిస్తున్న పేద ప్రజలు చలితో ఉండకూడదని వి.వి.యస్ విద్యార్థులు ఎబియర్ ఫౌండేషన్ ద్వారా దుప్పట్ల పంపిణీ చేశారు. విద్యార్థుల సేవాగుణాన్ని వి.వి.యస్. కరెస్పాండంట్ అనిశెట్టి కృష్ణారెడ్డి అభినందించారు. రాత్రి సమయంలో విద్యార్థుల దుప్పట్ల పంపిణీ విషయమై సహకరించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.