పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామం మాజీ ఎంపీటీసీ వడగా శ్రీరాములు గురువారం కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మీడియాతో మాట్లాడుతూ తనది మూలపేట గ్రామం, చేనేత వృత్తి మగ్గం పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటానని, హైదరాబాద్ కి చెందిన చిలకమర్తి చంద్ర శేఖర్, మహారాష్ట్ర పూణే కి చెందిన చిలకమర్తి శ్రీకాంత్ దగ్గర మూడు లక్షల రూపాయలకు ది.09.03.2011 సంవత్సరంలో 50 సెంట్లు భూమిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. 12 సంవత్సరాల తర్వాత ఎస్.ఈ.జెడ్. (స్పెషల్ ఎకనామిక్ జోన్) ది.07.08.2023 సంవత్సరంలో ఎస్ఇజెడ్ అవార్డు నుండి తొలగించి వెనక్కి తిరిగి ఇవ్వడం జరిగిందని, ఆ వెంటనే నా మిత్రుడైన యలమంచలి ఉమామహేశ్వరరావు, అబ్బిరెడ్డి భవన్నారాయణ రెడ్డి, పై నలుగురు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయకుండా అనిశెట్టి నారాయణరెడ్డికి రిజిస్ట్రేషన్ చేయించారని తెలిసి ఇదేమిటని తాను పెద్దలలో పెడితే 231/2 సెంట్లు నా పేరు మీద రాయడం జరిగిందన్నారు. మిగిలిన భూమి ఎప్పుడు రాస్తారు అని అడిగితే కాలయాపన చేస్తున్నారన్నారు. భూమి కోసం అడిగితే నన్ను, నా కుటుంబాన్ని భూమి మీద లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారని మీడియా ఎదుట వాపోయారు. ఈ సమస్యను మీడియా ముఖం ద్వారా అందరికీ తెలియజేయాలని న్యాయం చేయాలని నాకు జరిగిన అన్యాయాన్ని నా కుటుంబానికి రక్షణ కల్పించాలని మీడియాకు విన్నవించుకున్నారు. శ్రీరాములకు మద్దతుగా బీసీ నాయకులు, తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు మద్దతు తెలిపి, ఆయన మాట్లాడుతూ పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో బీసీల పై చిన్న చూపు చూడడం సరైన విధానం కాదన్నారు. తమ నియోజకవర్గంలో బీసీ కులానికి చెందిన వడగా శ్రీరాములు భూమిని అక్రమంగా అన్యాక్రాంతం చేసుకునేందుకు ప్రయతిసున్న వారిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉన్నతాధికారులు బాధితుడికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం పోలీస్ స్టేషన్లో పిర్యాదు అందజేశారు.