పిఠాపురం : ఆధ్యాత్మిక పేరు పొందిన పిఠాపురం పట్టణంలో చిట్టోడు తోట నందు కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మ వారికి ఆ ప్రాంత ప్రజలు బోనాలు అందజేశారు. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా సోమవారం రాత్రి ఆలయ సమీపంలో ఉన్న మహిళలు కలశాలతో బోనాలు ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయంలో సమర్పించారు. రెల్లి కులస్తులు నిర్వహిస్తున్న ఈ ఆలయంలో ప్రతిరోజు అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజలు, అమ్మవారి అలంకరణ అత్యంత వైభవంగా చేస్తున్నారు. తీన్మార్ డప్పులతో, గరగ ఆటలు బోనాలతో పలు వీధుల గుండా ఊరేగింపు చేస్తూ ఆలయంలో అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు ఎర్రంశెట్టి శ్రీనివాసు, ధనాల నాని, ఇంటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు