పిఠాపురం : పట్టణంలోని స్థానిక కత్తులగూడెం గాంధీ బొమ్మ సెంటర్‌లో శ్రీ సిద్ధి వినాయక స్వామి మండపం పునఃనిర్మాణం, విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. గాంధీబొమ్మ సెంటర్లో గల శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయము నందు భక్తుల సహాయ సహకారములతో మండపం పునఃనిర్మాణము మరియు నూతన విగ్రహాలు ఆవిష్కరణ చేస్తున్న సందర్భంగా లక్ష్మీగణపతి, శ్రీ రుద్ర, నవగ్రహ, దత్తాత్రేయ మరియు సకల దేవతా హోమములు, అభిషేకములు నిర్వహించారు. ఈ మహత్తరమైన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు ప్రజలు పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధివినాయక ఆలయ ఉత్సవకమిటి సభ్యులు ఆహ్వానం మేరకు ఇక్కడకు విచ్చేయడం జరిగిందని, ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి, జనసేన నాయకులు చెల్లుబోయిన సతీష్, జోగా వెంకటరమణ, మురాలశెట్టి సునీల్, సిద్ధివినాయక ఆలయ ఉత్సవకమిటి సభ్యులు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
