పిఠాపురం : మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిమిత్తం మహారాష్ట్రలో రెండు రోజులు పర్యటన కొనసాగడం జరిందని, ఆయన ఆదేశాల మేరకు పిఠాపురం జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పిఠాపురం పట్టణంలోని స్థానిక కోపరేటివ్ బ్యాంక్ నుండి శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వరకు పాదయాత్రగా వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం ధీటుగా కొనసాగుతూ వస్తుందని, గత రెండు రోజులుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క గెలుపుకి ప్రచార బాధ్యతలు నిర్వహించారన్నారు. దాదాపు 8 నియోజకవర్గంలో ఆయన పర్యటించడం జరిగిందని, దానికి ప్రజల యొక్క విశ్లేషమైన స్పందన వచ్చిందన్నారు. అలానే మహారాష్ట్ర త్వరలోనే మంచి ప్రభుత్వం వస్తుందని కోరుకుంటూ మహారాష్ట్ర ప్రజానీకానికి మంచి జరగాలని పట్టణంలోని శ్రీపాద శ్రీ వల్లభ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి సౌజన్య ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ది పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సోసైటీ బ్యాంక్ ఛైర్‌పర్సన్ చెల్లుబోయిన ప్రమీల నాగేశ్వరరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మీ, జనసేన నాయకులు చెల్లుబోయిన సతీష్, మురాలశెట్టి సునీల్, ది పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సోసైటీ బ్యాంక్ డైరెక్టర్ మేళం రామకృష్ణ (టైల్స్ బాబీ), అధిక సంఖ్యలో జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.