పిఠాపురం : కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలు అన్ని భక్తుల తాకిడితో కిటకిటలాడాయి. పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన ఓదూరి నాగేశ్వరరావు, ఓదూరి వీరలక్ష్మి దంపతుల ఆర్థిక సహాయంతో వారి కుమారులు ఓదూరి కిషోర్, ఓదూరి నవదీప్, ఓదూరి సోమేశ్వర సాయిల ఆధ్వర్యంలో చేబ్రోలు గ్రామంలోని శివాలయం ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ స్థాయిలో వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓదూరి కిషోర్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా తమ కుటుంబం కార్తీకమాసంలో వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయిలో 15వేలకు మంది పైగా విచ్చేసి తాము ఏర్పాటు చేసిన విందుని స్వీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ తమ్ముడు తంగెళ్ళ సురేష్, తదితరులు పాల్గొని, అన్నప్రసాదాన్ని వడ్డన చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన నాయకులు, జనసేన వీర మహిళలు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.