కాకినాడ : హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ కుస్తీ క్రీడాకారిణి బహుళ కామన్వెల్త్ బంగారు పతక విజేత వినీష్ పోగట్ జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించడం పట్ల పౌర సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఒలంపిక్స్ లో బంగారు పతకం రాకుండా మోకాలడ్డిన దురదృష్టం వెన్నంటినా దేశప్రజల శాశ్వత అభిమాన పతకం పొందిన ఆమె గెలుపు పట్ల హర్షం వ్యక్తమవుతోందని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు.