పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జీ మర్రెడ్డి శ్రీనివాస్‌ని పిఠాపురానికి చెందిన దానం లాజర్‌బాబు సోమవారం చేబ్రోలు జనసేన పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పూలబొకేను అందజేశారు. ఈ సంధర్భంగా దానం లాజర్‌బాబు మాట్లాడుతూ జనసేన పార్టీలో కష్టపడిన ప్రతీ ఒక్కరికీ పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. అదే విధంగా రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ డైరెక్టర్‌గా తనను నియమించడం చాలా ఆనందంగా వుందని, తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు. ముందుగా నాకు ఈ బాధ్యతను అప్పగించిన పవన్ కళ్యాణ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సూరవరపు సురేష్, చెల్లుబోయిన సతీష్, మురాలశెట్టి సునీల్, మార్నిడి రంగబాబు తదితరులు పాల్గొన్నారు.