- ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు
పిఠాపురం : పి”టాప్”రం ఇప్పుడు ఈ పేరు తెలియని వాళ్ళు లేరు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల నుంచి రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా ఈ పేరు మారు మోగిపోయింది. అందుకు కారణం పవర్ స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడమే. అయితే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అంటే ఆయన గెలుపొందితే అంతే రీతిలో అభివృద్ధి కూడా వుంటుందని పిఠాపురం ప్రజలు నమ్మి అత్యధిక మెజారిటీతో గెలుపును అందించారు. అభివృద్ధి మాట ప్రక్కన పెడితే అరకొర పర్యటనలో భాగంగా పిఠాపురం తూతూ మంత్రంగా సాగుతుంది. విద్యుత్ అధికారులు ముందుగానే పత్రికా ప్రకటన విడుదల చేసి శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెట్ల వల్ల వాటిని నరికేందుకు విద్యుత్ నిపివేస్తున్నమని తెలిపారు. అయితే సంబంధిత అధికారులు అరకొర పని చేసి చేతులు దులుపుకున్నారు. దీనిపై అధికారులను ప్రశ్నించిన ప్రజలకు పొంతనలేని సమాధానాలు చెప్పి, తూతూ మంత్రంగా పనులు చేశారు. దీంతో పిఠాపురం ప్రజలు సగం సగం అభివృద్ధికే పరిమితమైందని ముక్కున వేలేసుకుంటున్నారు.