పిఠాపురం : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) సంస్థ తీసుకున్న నిరంకుశ నిర్ణయాలకు ఎల్ఐసి ఏజెంట్లు ధర్నా చేపట్టారు. ఇటీవల ఎల్ఐసి సంస్థ ఏజెంట్లు వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కమిషన్ రేట్లు తగ్గించింది. తక్షణం కమిషన్ పూర్వం పద్ధతిలో ఉండాలని డిమాండ్ చేశారు. కొత్త పాలసీల్లో ప్రీమియం పెంపును ఉపసంహరించుకోవాలని ఆందోళన చేపట్టారు. ఎల్ఐసి నూతన వ్యాపార విధానాలు ఏజెంట్ వ్యవస్థను నాశనం చేసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలు బీమా చేసుకునే విధంగా ఉన్న కనీస బీమా లక్ష రూపాయలు ఉండాలని కోరారు. పాలసీ ప్రీమియంపై జీఎస్టీ తొలగించాలని డిమాండ్ చేశారు. రెండో రోజు ఆందోళన ఉదృతం చేశారు. కార్యక్రమంలో రాజమండ్రి డివిజన్ కౌన్సిల్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు రావుల మాధవరావు ఆధ్వర్యంలో పిఠాపురం బ్రాంచ్ ఏజెంట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు లోకారెడ్డి రామకృష్ణ, కె.వి.వి.సత్యనారాయణ, ఉడతా రామచంద్రరావు, పండు రాఘవులు, పొలిమేరు రాజబాబు, కొత్త బెన్నయ్య, రాంబాబు, కొప్పుశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
