పిఠాపురం : మంగళవారం రాత్రి సినీ నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద వార్త కవర్ చేస్తున్న టీవీ9 ప్రతినిధి రంజిత్ పై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ పిఠాపురం జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు పట్టుకొని పిఠాపురం పట్టణంలో పిఠాపురం నియోజకవర్గం జర్నలిస్టులు అందరూ కలిసి ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టులపై చేయి చేసుకోవడం సరైన పద్ధతి కాదని, మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలంటూ ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో ఆందోళన నిర్వహించారు. అనంతరం జర్నలిస్టులకు రక్షణ చట్టం కల్పించాలంటూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గం జర్నలిస్టులు పాల్గొన్నారు.