పిఠాపురం : ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి పిఠాపురం పట్టణంలో ఆర్య వైశ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం చేయాలని పిలుపు ఇవ్వడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం వర్మ, మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడింది పొట్టి శ్రీరాములుని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఆయన ఎంతో సేవ చేశారని అనేక రోజులపాటు నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు, పిఠాపురం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ అధ్యక్షుడు దంగేటి సత్యనారాయణ అనే సత్తిపండు, కార్యదర్శి కంచర్ల నగేష్, కోశాధికారి తాతాజీ, ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు ఇమ్మిడిశెట్టి నాగేంద్ర, ప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకులు కేతవరపు కృష్ణ, మద్దాల బుచ్చిబాబు, చెక్క సుబ్రహ్మణ్య శ్రేష్టి , వీరబాబు, నడిపిల్లి ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.
