పిఠాపురం : సోమవారం మాధాపురంలో అత్యాచారనికి గురైన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మేల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ పరామర్శించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల నుంచి వివరాలడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ మైనర్ బాలికపై అత్యాచారం జరగడం చాలా దారుణం అన్నారు. అత్యాచారానికి పాల్పడిన, సహకరించిన వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తాం అని కుటంబ సభ్యులకు హామీ ఇచ్చారు. దీనికి కారణం అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన దుర్గాడ లక్ష్మణ్ అనే జాన్ నీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం అని వర్మ పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాకి తెలియజేశారు. ఇటువంటి కార్యకలాపాలు తెలుగుదేశం పార్టీ ఖండిస్తుందని, ప్రస్తుతానికి ఆ బాలికను కాకినాడ జి.జి.హెచ్ కి తరలించారు. మెరుగైన వైద్యం చేయిస్తామని, ప్రైవేటు ఆసుపత్రికి అయితే మార్చడం జరుగుతుందన్నారు. ఈ విషయాలు అన్ని కూడా పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుందన్నారు. బాలిక షెడ్యుల్ కులానికి చెందిన వారు, ఆమె తల్లికి 3 ఆడబిడ్డలని, ఆ భాదిత కుటుంబానికి ప్రభుత్వం నుండి రావాల్సిన సహాయ సహకారాలు ఆ కుటుంబాని ఇవ్వడమే కాకుండా, మెరుగైన వైద్యం అందిస్తుందని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆ కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్న ఆదుకుంటుందన్నారు. ఇటువంటి సంఘటనలు పునావృతం కాకుండా పిఠాపురంలో పోలిస్ పెట్రోలింగ్ పెంచాలని, కూడలిలో మీటింగ్ లు పెట్టిన, మాధాపురం, రాధాలపేట సబ్ వేలు, చిత్రాడ బ్రిడ్జి కింద పలు చోట్ల మద్యం సేవించిన వారు తిరుగుతూ ఉంటారు కాబట్టి చాలా వరకూ పోలిస్ వారు నియంత్రణ చేసారన్నారు. రాత్రి 9.30గం.లు సమయం తర్వాత మద్యం సేవించి రోడ్లపై తిరుగుతూ ఉన్న వారిని కూడా అరెస్ట్ చేయడం లేదా వారిని ఇంటికి పంపే ప్రయత్నం చేయాలని, పెట్రోలింగ్ ఇంకా పెరగాలని, ఇంకా పెట్రోలింగ్ పెంచితే ప్రజలు దైర్యంగా ఉంటారని, సంఘటన జరిగింది కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నారు. పెట్రోలింగ్ పెంచి ప్రజలకు రక్షణ కలిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండేపూడి సూర్యప్రకాష్, పిల్లి చిన్న, కొరుప్రోలు శ్రీను, నల్లా శ్రీను, అల్లవరపు నగేష్, మసకపల్లి రాజా, అడ్డూరి శ్రీను, మసకపల్లి రాజా, ఎలుబండి వెంకటరమణ అనే బాబులు, ఆలం దొరబాబు, విల్లా నాగబాబు, లాయర్ నాని, నుతాటి ప్రకాష్, తిరుమల రావు, కేతరపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.