పిఠాపురం : పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద సోమవారం సాయంత్రం అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగిందని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అన్నారు.
ఘటనా సమయంలో అప్రమత్తమైన చెత్త ఏరుకుంటున్న మహిళ, పెద్దగా కేకలు వేసి అరచి, స్థానికుల సహాయంతో నిందితుణ్ణి డి. లక్ష్మణ్ (జాన్)ని, నిందుతుడికి సహకరించిన మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. లేని పక్షంలో నిందితులు తప్పించుకోడానికి ఆస్కారం కలిగేదన్నారు. ఈ అమానుష చర్యను నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తీవ్రంగా ఖండిస్తుందని, నిందితుడు జాన్ ని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని, ఈ దుస్సంఘటన గురించి తెలిసిన వెంటనే బాలిక కుటుంబాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కాకినాడ జిల్లా బృందం పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగిందన్నారు.
బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించాలని, బాధితురాలు, వారి కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేశారు.
– ముద్దాయి జాన్ ని కఠినంగా శిక్షించాలి
ముద్దాయి జాన్ ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా బాధితురాలు యొక్క ఫొటోలు కానీ, సంబంధిత వీడియోలు కానీ సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయకూడదని తెలియజేస్తున్నామన్నారు. ఇది చట్టరీత్యా కూడానేరమని, ఇటువంటి ఘోరాలు జరగకుండా పోలీసులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నామన్నారు.