- 14వార్షికాలు పూర్తి చేసిన గురుస్వామి వాసుదేవ ఆచార్యను సత్కరించిన గణపతి పీఠం
కాకినాడ : త్రేతాయుగంలో శ్రీరాముని 14ఏళ్ళ వనవాసంలో పాదయాత్ర చేసి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భాగ్యం పొందారని, ద్వాపర యుగంలో పాండవుల వనవాస పాదయాత్రతో ధర్మం నిలిచిందని కలియుగంలో ఆదిజగద్గురువులు చేసిన పాదయాత్రలను అనుసరించడం వలన మూడు తరాల ప్రారబ్ధ కర్మల పరిహారం కలుగుతుందని భద్రాచల పాదయాత్రికుల గురుస్వామి వాసుదేవ ఆచార్య (ఉంగరాల వీర వెంకట సుబ్బారావు) పేర్కొన్నారు. గత 8 నుండి 18వరకు 9రోజులపాటు 200 మంది హనుమ దీక్షా పరులతో 14వ భద్రాచల రథోత్సవ పాదయాత్రను పూర్తి చేసిన సందర్భంగా భోగిగణపతిని దర్శించి పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పట్టుశేష వస్త్రాలతో సత్కరించి శ్రీవారి జ్ఞాపికను అందజేశారు. దైవసంకల్పంగా ఆధ్యాత్మిక ప్రముఖులు గళ్లా సుబ్బారావు, ఉంగరాల సుబ్బారావు, గిడుతూరి వీరభద్రరావు మున్నగు సీనియర్ సిటిజన్స్ ముగ్గురు ఏకోన్ముఖమై తొలుతగా భోగిగణపతి పీఠంలో సత్సంకల్పం చేసి 2012 విజయనామ సంవత్సర మహాశివరాత్రి నాడు ప్రత్యేక పూజలతో చేపట్టిన భద్రాచల పాదయాత్ర 14ఏళ్లుగా నిర్విఘ్నంగా జరుపుకుని జిల్లాలోని పలు ప్రాంతాల్లో శ్రీరామ ఆలయాలు నిర్మించడం, శ్రీవారి వైభవంగా పీఠం చరిత్రలో నిలిచిన సువర్ణ అధ్యాయమని రమణరాజు పేర్కొన్నారు.