కర్నూలు జిల్లా/ ఎమ్మిగనూరు: ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో గ్రామాల్లో ఉన్న గ్రామస్తులు, ఇంటికి తాళాలు వేసుకొని కుటుంబ సభ్యులు అంత పొలం బాట పడుతున్నారు. ఇదే అదునుగా భావిస్తున్నా దొంగలు పట్టపగలే దొంగతనాలకు తెరాలేపారు. ఇలా దొంగతనం కు వచ్చి గ్రామస్తులు కంటపడిన ఆ దొంగను విద్యుత్ స్తంభం కు కట్టేసి దేహశుద్ధి చేసిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామంలో ఒ ఇంట్లో చోరీ చేయడానికి వచ్చి దొంగ,గ్రామస్తుల కంట పడటంతో ఆ దొంగకు దేహశుద్ధి చేశారు.ప్రస్తుతం వర్షాలు బాగా కురుస్తుండటంతో గ్రామంలో ఒ రైతు ఇంటికి తాళం వేసి పంటసాగు చేయడానికి కుటుంబ సభ్యులు అంత వెళ్లారు. ఇదే అదునుగా భావించిన ఒ దొంగ ఆ ఇంటి తాళం పగలకొట్టే ప్రయత్నం చేసాడు. దింతో ఇంటికి కొంత దూరంలో ఉన్న వారికీ శబ్దం వినపడటంతో వారు అటుగా వెళ్లి చూడటంతో తాళం పగలగొడుతుండగా దొంగను చూసారు. వెంటనే ఆ దొంగను పట్టుకొని ఒ విద్యుత్ స్తంభం కు కట్టేసి గ్రామస్తులు అంత కలిసి దేహశుద్ధి చేసి,ఎమ్మిగనూరు రూరల్ పోలీసులకు అప్పగించారు. దొంగను అదుపులోకి తీసుకున్న పోలీస్ లు దొంగ గురించి ఆరాధియగా, ఆ దొంగ గార్లదిన్నె గ్రామానికి చెందిన సామెల్ అని, తనకు కొన్ని రోజుల మతిస్థిమితం సరిగ్గా లేక ఇలా వ్యవహారిస్తూ ఉన్నాడని తెలిపారు.