కరీంనగర్ జిల్లా: మంత్రి వర్యులు మరియు బీ.ఆర్.ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు సాయంత్రం కరీంనగర్లో విస్తృతంగా పర్యటించగా, ప్రజలు మరియు బీ.ఆర్.ఎస్.పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు.కరీంనగర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తీగల వంతెనతో పాటు పలు అభివృద్ధి పనులను కేటీఆర్, మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి. వినోద్ కుమార్, రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ తో కలిసి ప్రారంభించారు..