కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలకేంద్రం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం ఓటర్ జాబితా అవగాహన సదస్సు నాయబ్ తహసీల్దార్ నరసింహ చారి,ఎంపీడీఓ తీగల శంకర్, ఎంపిఓ శ్రీనివాస్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మరణించిన ఓటరు వ్యక్తి కుటుంబ సభ్యుల నుండి డెత్ సర్టిఫికెట్ తీసుకొని వారిని ఓటర్ లిస్ట్ నుండి డిలీట్ చేయాలని, రాజకీయ పార్టీ నాయకులు కూడా ఓటర్లకు అవగాహన కల్పించాలని, ఓటర్ లిస్టులో చేర్పులు మార్పులు ఉంటే అధికారులు చూసుకోవాలని, బి ఎల్ వో లు గ్రామాలలో ఇంటి ,ఇంటికి , తిరిగి ఓటరుకు ఏ వార్డులో ఓటుహక్కు ఉన్నదనేది తెలియజేయాలని, వారు సూచించారు. వివిధ పార్టీల రాజకీయ నాయకులు చెప్పే సలహాలు, సూచనలు , పాటిస్తామని వారు తెలిపారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెసు నాయకులు బొడ్డు సునీల్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు న్యాత సుధాకర్, బీజేపీ నాయకులు కుర్ర హరీష్ తదితరులు పాల్గొన్నారు.