కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన మంగళరాపు రాయమల్లు (45) సం, గురువారం రాత్రి 11.30 సమయంలో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై తాండ్ర నరేష్ తెలిపిన వివరాల ప్రకారం పుల్లెల తిరుపతి, పుల్లెల ఆంజనేయులు, దొగ్గల అనసూర్య, దొగ్గల ప్రదీప్ అందరు కలిసి అగ్రికల్చర్ ల్యాండ్ విషయంలో మంగళరాపు రాయమల్లును వేధింపులకు గురిచేయడం వలన మృతి చెందినట్లు అతని భార్య మంగళరాపు రమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తాండ్ర నరేష్ తెలిపారు.