కరీంనగర్ జిల్లా:మానకొండూర్ నియోజకవర్గం మానకొండూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు షూ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా విద్యాదికారి జనార్దన్ రావు మరియు ఇతర అధికారులతో కలిసి విద్యార్థులకు షూ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మొట్టమొదటి సారిగా షూ పంపిణీ చేయడం చాలా గొప్ప విషయం.రాష్టంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటి సారిగా మన జిల్లాలో మన మానకొండూర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతీ ప్రత్యేక చొరవ వల్ల రాష్టంలో మొదటి సారి మన జిల్లాలోని అన్ని జిల్లా పరిషత్ పాఠశాలలు మరియు మోడల్ స్కూల్ లో చదువుతున్న 22318 మంది విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా షూ పంపిణీ చేయడం జరుగుతుంది.
ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన జిల్లా కలెక్టర్ కి మరియు ఇందుకు సహకరించిన జిల్లా అధికారులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యకు మొదటి ప్రాధాన్యత అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న టీచర్ల సమస్యలను పరిష్కరించి ప్రమోషన్లు, బదిలీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు పారదర్శకంగా నిర్వహించి ప్రభుత్వ పాఠశాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి ఫలితాలు సాదించాలని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేస్తున్నాం కాబట్టే విద్యార్థులు బాగా చదువుకొని తల్లి దండ్రుల పేరు నిలబెడుతూ ఉన్నత స్థాయికి ఎదుగాలని కోరారు.