జగిత్యాల జిల్లా: పట్టణంలోని లోకమాత గాజుల పోచమ్మ తల్లి దేవాలయంలో భవాని భక్త బృందం వారు గత 46 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో కరపత్రాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్. బోగ శ్రావణి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, స్థానిక కౌన్సిలర్ ములస్తపు లలిత-మునిందర్, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు ఆకుపత్తిని శ్రీనివాస్, సాంబారి కళావతి, గదాస్ రాజేందర్, గాజుల రాజేందర్, రాగిళ్ల నారాయణ మరియు భవాని భక్త బృందం సభ్యులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.