కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం లోని హన్మజీపల్లి గ్రామానికి చెందిన దాసరి శ్రావణ్ సం (20) తండ్రి వెంకటి (మత్స్య కార్మికుడు) ఎల్ఎండి డ్యాం లో సోమవారం ఉదయం 6 గంటల సమయంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు. శ్రావణ్ ఇంటికి రాకపోవడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తోటి మత్స్య కార్మికులు శ్రావణ్ కోసం డ్యాం లో గాలిస్తున్నారు, సంఘటన స్థలానికి ఎస్ఐ చందా నరసింహారావు చేరుకొని పరిశీలిస్తున్నారు.
దాసరి శ్రావణ్ మూడు సంవత్సరాలు నుంచి చేపల వేటకు వెళుతున్నట్లు తోటి మత్స్య కార్మికులు తెలిపారు. శ్రావణ్ మృతదేహం లభ్యమైనట్లు మత్స్య కార్మికులు తెలిపారు.