కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని వివిధ గ్రామాలలో ఖాళీగా ఉన్నటువంటి రేషన్ డీలర్లను నియమించాలని శుక్రవారం మండల తహాసీల్దార్ కు సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గన్నేరువరం లోని వివిధ గ్రామాలలో డీలర్లు ఖాళీగా ఉండటం వలన ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని మరియు ఉన్న డీలర్లు సమయపాలన పాటించడం లేదని ఎమ్మార్వో గారికి విన్నవించారు .వెంటనే గ్రామాలలో ఖాళీగా ఉన్నటువంటి డీలర్లను నియమించాలని సిపిఐ నాయకులు తహసీల్దార్ ని కోరారు. ఇట్టి కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చోక్కల్ల శ్రీశైలం,మండల యూత్ సెక్రెటరీ మొలుగురి ఆంజనేయులు,మండల్ నాయకులు బోయిని మల్లయ్య, కూన మల్లయ్య, నయీమ్,రాపోలు రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.