కరీంనగర్ జిల్లా: నెహ్రూ యువ కేంద్రం మరియు యువ చైతన్య యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ గన్నేరువరం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. యువ చైతన్య యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అనిల్ రెడ్డి మాట్లాడుతూ.. స్వచ్ఛత పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి మన ఇంటిని ఏ విధంగా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా దేశాన్ని పరిశుభ్రంగా ఉంచే వైపు ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించి పనిచేయాలని ప్రతి సంవత్సరంలో 100 గంటలు ప్రతి వారానికి రెండు గంటలు శ్రమదానం చేయాలని తెలియజేస్తూ, విద్యార్థులు మరియు యువతి యువకుల్లో స్ఫూర్తిని నింపేందుకు శ్రమదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంట గౌతమ్,శీను, శివసాయి , రమ్య, దివ్య విద్యార్థినీ విద్యార్థినులు మండల యువకులు తదితరులు పాల్గొన్నారు.