కరీంనగర్ జిల్లా: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆహ్వానం మేరకు, దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కరీంనగర్ నగరంలోని జ్యోతినగర్ మహాశక్తి ఆలయంలో అమ్మవారిని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మానకొండూర్ శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ రాష్ట్ర యూత్ సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి లు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు మహిళలు యువకులు పాల్గొన్నారు.