కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామానికి చెందిన పురంశెట్టి బాలయ్య ను మున్నూరు కాపు రాష్ట్ర కార్యదర్శిగా నియామక ఉత్తర్వులను రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్ ఉత్తర్వులు జారిచేసారు. ఈ సందర్బంగా పురంశెట్టి బాలయ్య మాట్లాడుతూ సంఘం అభివృద్ధి కొరకు కృషి చేస్తానని, తనను నియమించిన కొండా దేవయ్య కి, తన నియామకానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్. కొనగాల మహేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చల్ల హరిశంకర్,గంప వెంకన్న, బొడ్డు సునీల్,కటుకం తిరుపతి, గోంటి సంతోష్, మార్గం కనుకయ్య,తోట పర్శరాములు,కనుకయ్య, వరాల పర్శరాములు, మార్గం మల్లేశం, కొట్టె నర్సయ్య, తదితరులు బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు.