కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని 17 గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మహిళలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను గ్రామాల కూడళ్లలో ఉంచి, బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడారు.
గ్రామాల్లో బతుకమ్మ సంబరాల సందర్భంగా అనేక రకాల పూలను సమకూర్చుకొని, మహిళలు బతుకమ్మలను పేర్చి గ్రామాల్లోని కుంటలు, చెరువులు, వాగులలో నిమజ్జనం చేశారు. ఈ వేడుకలు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై, తొమ్మిది రోజుల పాటు సాగి, సద్దుల బతుకమ్మతో ముగిసాయి.
బతుకమ్మలు నిమజ్జనం చేయుటకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు ఎలక్ట్రిక్ లైటింగ్‌తో ఏర్పాట్లు చేశారు. అంతేకాక, నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు చర్యలు తీసుకున్నారు.
గన్నేరువరం మండల వ్యాప్తంగా వర్షాలు పడుతున్నప్పటికీ, మహిళలు వర్షాన్ని లెక్కచేయకుండా బతుకమ్మ ఆటలు ఆడటం విశేషం. బతుకమ్మ ఘాట్‌లలో విద్యుత్ లైట్లతో అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు