కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం : ప్రజా పాలనలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు ప్రజ పాలన కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ అన్నారు. మంగళవారం మండలంలో నవాబుపేట, ఒగులాపుర్ గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీటిసి సభ్యులు రవీందర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అభయహస్తం గ్యారంటీ హామీలను అమలు పరిచేందుకే ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిందన్నారు. గత తొమ్మిది సంవత్సరాల కాలంలో కొత్త రేషన్ కార్డు, కొత్త పెన్షన్ల మంజూరి, పక్కా గృహ నిర్మాణ పథకాలు అమలుకు నోచుకోలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం పైరవీలు లేకుండా నిజాయితీగా, పారదర్శకంగా పేద ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. ఈనెల ఆరు తారీఖు వరకు దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. రేషన్ కార్డ్ లేని వారు ప్రత్యేక కౌంటర్లో ధరకాస్తు చేసుకోవాలని లబ్ధిదారులు జడ్పిటిసి సూచించారు.ఈకార్యక్రమంలో తహసీల్ధార్ నరేందర్,ఎంపీడీవో మామిడాల నర్సయ్య, డీఈ రవిప్రసాద్, మండల వ్వవసాయ అధికారి రంజిత్ రెడ్డి, డిప్యూటి తహసిల్దార్ పార్థ సారధి, వివిధ శాఖల అధికారులు సర్పంచులు సుద్దాల ప్రవీణ్, బోయిని శ్రీనివాస్, ఎంపీటీసీ మంకు స్వప్న, ఉపసర్పంచ్ లు ఎనగందుల రాజయ్య, కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ కూతురు రవీందర్ రెడ్డి, డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, నాయకులు ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి, ఠాకూర్ నరేందర్ సింగ్, షాబొద్దీన్, బోయిని వేణు, ఠాకూర్ దిలీప్ సింగ్, బోయిని వంశీకృష్ణ, జితేందర్ సింగ్, పిల్లి తిరుపతి, ఠాకూర్ రాణా ప్రతాప్ సింగ్ తో పాటు అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.