కరీంనగర్ జిల్లా: మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ గ్రామంలోని రాంలీలా మైదానంలో ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో రాంలీలా దసరా ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
రాంలీలా వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ హాజరయ్యారు.
ప్రతి ఏటా దసరా పండుగ రోజున నిర్వహించే రావణ వధ కార్యక్రమం రాంలీలా ఘనంగా నిర్వహించారు.
చిన్నారుల నాట్యాలు సాంస్కృతిక కళాకారుల ఆటాపాటలు అలరించాయి భారీ క్రాకర్ షో ప్రజలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.