కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలోని కౌండిన్య వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో శుక్రవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎలక్షన్ నిర్వహించారు. అధ్యక్షుని కోసం ఎన్నికలు నిర్వహించగా మొత్తం 108 మంది ఓటర్లు ఉండగా 99 మంది ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 91 శాతం ఓటర్ నమోదు కావడం జరిగింది. బుర్ర తిరుపతి గౌడ్ కి 52 ఓట్లు బుర్ర లక్ష్మీరాజం కి 47 ఓట్లు పోల్ కాగా ఐదు ఓట్లతో తేడాతో బుర్ర తిరుపతి గౌడ్ గెలుపు పొందారు. ఈ ఎలక్షన్ పురుషోత్తం కిషన్ బుర్ర రాజ్ కోటి ఆధ్వర్యంలో నిర్వహించారు. నూతన అధ్యక్షునిగా బుర్ర తిరుపతి గౌడ్, ఉపాధ్యక్షునిగా బుర్ర తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బుర్ర శ్రీధర్ గౌడ్, కార్యనిర్వాహణ కార్యదర్శిగా బుర్ర శ్రీనివాస్ గౌడ్, కోశాధికారిగా బుర్ర మల్లేశం గౌడ్, సహాయ కార్యదర్శిగా బుర్ర రాములు ఎన్నికయ్యారు.అనంతరం నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించారు. నూతన కమిటీకి గౌడ సంఘం సభ్యులు సన్మానించారు. అనంతరం మాజీ కార్యవర్గం సభ్యులను నూతన కమిటీ మరియు గౌడ సంఘం వీడ్కోలు పలికారు. ఈకార్యక్రమంలో గౌడ సంఘం మాజీ అధ్యక్షులు బుర్ర రాజయ్య గౌడ్, బుర్ర లక్ష్మీరాజం గౌడ్, బుర్ర అంజయ్య గౌడ్, నాగుల కనకయ్య గౌడ్, బుర్ర మల్లేశం గౌడ్, మునిగాల పరశురాం గౌడ్,బుర్ర ముత్తయ్య గౌడ్, బుర్ర నర్సయ్య గౌడ్, కందల నర్సయ్య గౌడ్, బుర్ర జంపయ్య నర్సయ్య, బుర్ర శ్రీకాంత్ గౌడ్, ఇక్కుర్తి పరశురాం గౌడ్,బుర్ర మల్లయ్య గౌడ్,నల్లగొని మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.