కరీంనగర్ జిల్లా: వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు గ్రామాల్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని కలెక్టర్ పమేల సత్పత్తి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం వారు ప్రారంభించారు. నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను పొందాలని. సన్న రకం వడ్లకు 500 బోనస్ ని కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే గుండ్లపల్లిలో నాటు కోడి పిల్లల మదర్ యూనిట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామీణ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి లో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర యూత్ సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్కూరి అనంతరెడ్డి, జిల్లా నాయకులు కొమ్మెర రవీందర్ రెడ్డి, గన్నేరువరం తాసిల్దార్ ఇప్ప నరేందర్, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, (ఐకెపి) ఎపిఎం లావణ్య, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తిప్పర్తి పరిపూర్ణ చారి, పార్టీ నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.