కరీంనగర్ జిల్లా: తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్ ఫోరం మానకొండూర్ ఇన్చార్జి లింగంపల్లి రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ సమావేశం లో లింగంపెల్లి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ప్రఖ్యాత ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా మొట్టమొదటిసారిగా ఒక దళిత బిడ్డను ఎంపిక చేసిన ముఖ్యమంత్రివార్యులు రేవంత్ రెడ్డికి, ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. సామజిక న్యాయం పాటించడం కాంగ్రెస్ పార్టీ కే సాధ్యమైందని ఈసందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టి టి ఎల్ ఫ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఊటుకూరి రామచంద్ర రెడ్డి, టి టి ఎల్ ఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సముద్రాల లింగారావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని, అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్ లను నియమించడం వల్ల విద్యా వ్యవస్థ కుంటు పడకుండా ఉంటుందని గా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టి టి ఎల్ ఫ్
రాష్ట్ర ప్రచార కార్యదర్శి సముద్రాల లింగారావు మరియు లెక్చరర్లు శ్యాంసుందర్ రెడ్డి, వెంకటస్వామి, నరేష్, బాలకృష్ణ, సుహాసిని, రమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.