contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సాధనతోనే విజయాలు సొంతం : కవ్వంపల్లి సత్యనారాయణ

  • జిల్లా స్థాయి గురుకుల పాఠశాలల క్రీడా పోటీలను ప్రారంభించిన మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ

 

కరీంనగర్ జిల్లా: సాధన చేస్తేనే క్రీడల్లో విజయాలను సొంతం చేసుకోవచ్చని మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ నారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపులే గురకుల పాఠశాలలో నిర్వహిస్తున్న 2024-25 జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ దేహదారుఢ్యానికే కాకుండా మానసిక ప్రశాంతకు, మనోల్లాసానికి దోహదపడతాయని అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న పోటీ ప్రపంచంలో యాంత్రిక జీవనం వైపు పరిగెడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దైనందిన జీవితంలో క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయన్నారు. క్రీడలతో మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చన్నారు. మానసిక ప్రశాంతత, ఆరోగ్యవంతమైన జీవనానికి క్రీడలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. విద్యార్థులకు చదువు ఎంత అవసరమో, క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమని చెప్పారు.క్రీడల వల్ల క్రమశిక్షణ అలవడుతుందన్నారు. క్రమశిక్షణ,పట్టుదలతో సాధన చేస్తే విజయాలను సొంతం చేసుకోవచ్చన్నారు. అయితే ఆటల్లో గెలుపు,ఓటములు సహజమేనని, ఓటమిని హుందా స్వీకరించాలని, ప్రతి ఓటమీ మన గెలుపు నాంది కావాలన్నారు. ఆరోగ్యకరమైన పోటీలు అవసరమేనని ఆయన పేర్కొన్నారు. క్రీడల వల్ల మనలో నిబిఢీకృతమైన శక్తిసామర్థ్యాలు బయటకు వస్తాయన్నారు. అందుకే విద్యార్థులు వ్యాయామంతో పాటు క్రీడలకు కొంత సమయం కేటాయించడమే కాకుండా తమకు ఇష్టమున్న క్రీడల్లో సాధన చేయాలని కోరారు. ఆటపాటలతోపాటు వ్యక్తిత్వ వికాసంపై విద్యార్థులు, యువకులు దృష్టి సారించాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి కోరారు. వ్యక్తిత్వ వికాసంతోపాటు వృత్తి నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తుందని ఆయన గుర్తు చేశారు. గురుకులాల్లో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తున్నదన్నారు.

ఈ క్రీడా పోటీల్లో జిల్లాలోని 15 గురుకుల పాఠశాల చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సమన్వయ అధికారి ఎం.అంజలీ కుమారి,పాఠశాల ప్రధానాచార్యులు సరిత, సంబంధిత అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మోరపల్లి రమణారెడ్డి, సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, ఒగ్గె దామోదర్, పులి కృష్ణ, కుంట రాజేందర్ రావు,తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, ఎస్ కొండల్ రావు, ముక్కిస రత్నాకర్ రెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, నోముల అనిల్, పోలు రమేష్, రాము, మాచర్ల అంజయ్య,ఆశిక్ పాషా,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :